News February 13, 2025
నిర్మల్: యువతి దారుణ హత్య.. నిందితుడికి జీవత ఖైదు

ఏడాది క్రితం ప్రేమ పేరుతో <<12630813>>యువతిని హత్య<<>> చేసిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు జీవితకాల శిక్ష, విధించింది. పోలీసులు వివరాలు.. ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ అదే కాలనీకి చెందిన అలేఖ్యను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె నిరాకరించడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విషయం తెలుసుకున్న శ్రీకాంత్ 2024 ఫిబ్రవరి 8న ఆమెను కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు.
Similar News
News December 17, 2025
ADB: ‘కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయండి’

ఈనెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంను విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అందరిని పరీక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1002 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అందరు తమ ఇంటికి వచ్చే సర్వే బృందాలకు సహకరించాలని కోరారు.
News December 17, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విజయం మహిళదే

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా తలమడుగు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో బుధవారం సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లి-కే సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుమ్ముల లక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తొడసం రుక్మా బాయిపై 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 ఏకగ్రీవం అయ్యాయి.
News December 17, 2025
బోథ్: అవ్వకు పోలీసు లాఠే చేతి కర్ర.. మానవత్వం చాటుకున్న SP

బోథ్ మండల నుంచి సొనాలకు వెళ్తున్న ఒక వృద్ధ మహిళ వాహనం నుంచి కిందపడి తలకు గాయమైంది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవ తీసుకొని తన వాహనంలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ అందజేసి, వెంటనే సిబ్బంది సహకారంతో అవ్వకు ప్రథమ చికిత్స చేయించారు. తదుపరి నడవలేని స్థితిలో ఉన్న అవ్వకు పోలీసు లాఠీని అందజేశారు. వెంటనే బోథ్ PHCకి తరలించి మానవత్వం చాటుకున్నారు.


