News March 1, 2025

నిర్మల్: రంజాన్ మాసంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఎస్పీ

image

రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం ముస్లిం సోదరులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మసీదుల వద్ద ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలను అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు.

Similar News

News March 1, 2025

అనంతపురం జిల్లా మహిళలకు శుభవార్త

image

టైలరింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18-45ఏళ్ల వారు ఆధార్, రేషన్ కార్డుతో అనంతపురంలోని ఆకుతోటపల్లి వద్ద ఉన్న రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మార్చి 2లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, 30 రోజుల పాటు శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.

News March 1, 2025

రోడ్డుప్రమాదంలో విశాఖ వాసి మృతి

image

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి మృతి చెందాడు. విశాఖ న్యూ పోర్టు కాలనీకి చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం అరకులోయ వైపు వెళుతుండగా డుంబ్రిగుడ మండలం నారింజవలస వద్ద స్కూటీ డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమనాథ్ మృతిచెందాడు. రామ్మోహన్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News March 1, 2025

అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో.. 14,862 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST

error: Content is protected !!