News November 10, 2025
నిర్మల్: రక్షణ కిట్లను అందజేసిన కలెక్టర్

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు రక్షణ కిట్లను అందజేశారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమయ్యే పరికరాలు ఈ కిట్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణీ, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
భద్రకాళి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రేశ్వర స్వామివారికి అసంఖ్యాక రుద్రాక్షలతో అభిషేకం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరిని ఏర్పాటు చేశారు.
News November 11, 2025
జడేజా-శాంసన్ స్వాపింగ్ నిజమే!

IPLలో CSK, RR జట్ల మధ్య ట్రేడ్ టాక్స్ నిజమేనని Cricbuzz పేర్కొంది. ఓ ఫ్రాంచైజీ ఆఫీసర్ దీనిని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. RR నుంచి శాంసన్ CSKకి, చెన్నై నుంచి రాజస్థాన్‌కు జడేజా, సామ్ కరన్ మారతారని తెలిపింది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లు ఇందుకు అంగీకరించి సంతకాలు చేశారని వివరించింది. స్వాప్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుందని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంది.
News November 11, 2025
జగిత్యాలలో నేటి మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,201, కనిష్ఠ ధర రూ.1,600, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,961, కనిష్ఠ ధర రూ.1,810, వరి ధాన్యం(BPT) గరిష్ఠ ధర రూ.2,041, కనిష్ఠ ధర రూ.1,930, వరి ధాన్యం(HMT) ధర రూ.2,261, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,631, కనిష్ఠ ధర రూ.1,951గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


