News December 12, 2025
నిర్మల్: రెండో విడత ఎన్నికలు జరిగే జీపీలు ఇవే

నిర్మల్ జిల్లాలో ఈనెల 14 ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని నిర్మల్ రూరల్‌లో20, సారంగాపూర్ 32, సోన్ 14, దిలావర్పూర్ 12, నర్సాపూర్ జి 13, లోకేశ్వరం 25, కుంటాల 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News December 13, 2025
పెరిగిన చలి.. వరి నారుమడి రక్షణకు చర్యలు

చలి తీవ్రత పెరిగి రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వరి నారుమడుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో భాగంగా రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. నారు దెబ్బతినకుండా రోజూ ఉదయాన్నే మడిలో చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్త నీరు పెట్టాలి.
News December 13, 2025
19 అమావాస్యలు ఇలా చేస్తే…?

కూష్మాండ దీపాన్ని అమావాస్య/అష్టమి రోజు వెలిగించాలి. మొత్తం 19 అమావాస్యలు/19 అష్టములు ఈ దీపం వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజానంతరం ఎండు ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే గ్రహ వాస్తు పీడల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. జనాకర్షణ, ధనయోగం కోసం ఈ పరిహారాన్ని పాటిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని కాల భైరవుడిని స్మరిస్తూ సంకల్పం చెప్పుకొని ఈ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తారు.
News December 13, 2025
వరంగల్: ‘మా ఓట్లు అమ్మట్లేదు’ ఇంటి గోడపై పోస్టర్!

‘మా ఓట్లు అమ్మడం లేదు’ అంటూ ఇంటి గోడపై ఓటర్లు ఓ పోస్టర్ అతికించిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో జరిగింది. నల్లబెల్లి మండలంలో రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమ ఓటు ఎవ్వరికీ అమ్మబోమని స్పష్టం చేస్తూ గ్రామ ఆదర్శ రైతు రాధాకృష్ణ పోస్టర్ అతికించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అయ్యింది.


