News October 28, 2025
నిర్మల్: రేపటి నుంచి సోయా కొనుగోలు ప్రారంభం

నిర్మల్ మార్కెట్ యార్డ్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం (రేపటి) నుంచి సోయా కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి తెలిపారు. రైతుల పంటను త్వరగా కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల, ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు రైతులు సహకరించాలని కోరారు.
Similar News
News October 28, 2025
హరీశ్ రావు తండ్రి మృతి.. దూరంగా కవిత

TG: మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్వయానా KCR బావ. దీంతో మాజీ CM కుటుంబమంతా ఉదయం నుంచి హరీశ్ ఇంటి వద్దే ఉంది. అయితే తన మామ అంత్యక్రియలకు కవిత దూరంగా ఉన్నారు. ఇటీవల హరీశ్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేయడమే అందుకు కారణం. రాజకీయ విభేదాలతో కుటుంబాల మధ్యా వైరం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ టైమ్‌లో కవిత వెళ్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News October 28, 2025
నస్పూర్: టీచర్ అవతారమెత్తిన జిల్లా కలెక్టర్

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమారు దీపక్ అధ్యాపకుని అవతారం ఎత్తారు. నస్పూర్ మండలం కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినీలకు స్వయంగా పాఠాలు బోధించి ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని అధ్యాపకులకు సూచించారు.
News October 28, 2025
వరంగల్: ఆయనపై మంత్రి దామోదర చర్యలు ఉత్తవేనా..?

ఉత్తర తెలంగాణకు గుండెకాయలా ఉన్న వరంగల్ <<18099653>>ఎంజీఎం<<>> దుస్థితి నానాటికి దిగజారిపోతోంది. నేతలు కన్నెత్తి చూడకపోవడంతో అధికారులు మొద్దు నిద్ర పోతున్నారు. తాజాగా ఒకే సిలిండర్ ఇద్దరు చిన్నారులకు ఇచ్చిన ఘటనలో ఎంజీఎం <<18107035>>సూపరింటెండెంట్‌పై వేటు<<>> వేశారని మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్యలంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోజు వచ్చి ఆయన ఆఫీసులోనే ఉంటున్నారని తెలుస్తోంది.


