News April 4, 2025
నిర్మల్: రేపు కలెక్టరేట్‌లో జగ్జీవన్ రామ్ జయంతి

నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 10 గంటలకు డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జయంతి వేడుకలకు జిల్లాలోని అధికారులు, కుల సంఘాల ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
Similar News
News April 11, 2025
KMR: పోలీస్ స్టేషన్ రైటర్లకు ఎస్పీ దిశానిర్దేశం..

కామారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న రైటర్లతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సమావేశం అయ్యారు. నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాల్లోని ముఖ్యమైన అంశాలను ఎస్పీ వివరించారు. పోలీస్ స్టేషన్ రైటర్లు కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. కొత్త చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే వారు సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలరని స్పష్టం చేశారు.
News April 11, 2025
ADB: పరస్పర దాడులు.. 8మందిపై కేసు

పరస్పరంగా దాడులు చేసుకున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై గౌతమ్ తెలిపారు. KRK కాలనీకి చెందిన సాజిద్ మరో మహిళ వద్ద ఉంటున్నాడన్న కోపంతో భార్య సల్మా అక్కడకు వెళ్లి గొడవ చేసింది. దీంతో సాజిద్ తన భార్యను నచ్చజెప్పి ఇంటికి తీసుకురాగా సల్మా బంధువులు సాజిద్‌పై దాడి చేశారు. దీంతో సాజిద్ రెండో భార్యగా అనుమానిస్తున్న ఆఫ్రిన్ బంధువులు వారిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన వారిపై కేసు చేశారు.
News April 11, 2025
MNCL: 19న అంతరిక్ష విజ్ఞానంపై వెబినార్

భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 19న ఆన్‌లైన్‌లో వెబినార్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి, అభిరుచి కల్పించేందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందులో పాల్గొనేందుకు ఈ నెల 17 లోగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. www.aryabhata.indiaspaceweek.org వెబ్ సైట్ సందర్శించాలన్నారు.