News December 26, 2025

నిర్మల్: రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్‌డెడ్

image

సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఏఎస్సై దేవన్న కథనం ప్రకారం.. లక్ష్మణచాంద మండలం రాచాపూర్ గ్రామానికి చెందిన జంబుగ రాధా తన భర్త చిన్నపోసులుతో కలిసి బైక్‌పై గోదావరి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కూచన్‌పల్లి శివారులో రోడ్డుపై కుక్కలు అడ్డురావడంతో బైక్‌పై నుంచి కింద పడ్డారు. ఈ క్రమంలో తల వెనుక తీవ్ర గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Similar News

News December 27, 2025

పాల ఉత్పత్తి పెరగడానికి ఎలాంటి దాణా ఇవ్వాలి?

image

శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉండటానికి అదనపు శక్తి అవసరం. దీని కోసం సాధారణ మేతతో పాటు, శక్తినిచ్చే దాణా, సప్లిమెంట్లు ఇవ్వాలి. బెర్సీమ్‌ గడ్డి, వివిధ రకాల మాంసకృత్తులు కలిగిన చెక్క (వేరుశనగ చెక్క, పత్తి చెక్క, సోయా బీన్‌ చెక్కలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి) దినుసులను దాణాలో కలిపి పశువులకు ఇవ్వాలి. పశువులకు పెట్టే ఆహారంలో 17% ఫైబర్‌ ఉంటే వాటి పాల ఉత్పత్తి, కొవ్వు పరిమాణం పెంచవచ్చు.

News December 27, 2025

ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ!

image

AP: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1న న్యూ ఇయర్ ఆప్షనల్ హాలిడే ఉన్న సందర్భంగా పెన్షన్లను డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30 నాటికి నగదు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. మిగిలిపోయిన పెన్షన్లు జనవరి 2న పంపిణీ చేయాలని పేర్కొంది.

News December 27, 2025

ఇంగ్లీషు జర్నలిజంలో యలవర్రు నుంచి ఢిల్లీ దాకా

image

ఆంగ్ల జర్నలిస్ట్ DAగా ప్రసిద్ధులైన ధూళిపూడి ఆంజనేయులు 1924లో యలవర్రులో జన్మించారు. విద్యార్థిదశ నుంచి ఇంగ్లీషు సాహిత్యం పట్ల ఆసక్తితో రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనను తాను రూపుదిద్దుకున్నారు. ఆయన జర్నలిస్టుగా క్వెష్ట్, ఇండియన్ రివ్యూ, థాట్, ఇండియన్ లిటరేచర్, త్రివేణి, ఫైనాంషియల్ ఎక్స్ ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ రైటింగ్ టుడే వంటి పత్రికలకు రచనలు చేశారు.
@నేడు ఆయన వర్ధంతి.