News February 6, 2026

నిర్మల్: రోడ్లకు మరమ్మతులు.. ప్రమాదాలు ఆగేనా..?

image

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ చొరవతో రహదారులకు మాహర్దశ రానుంది. జిల్లాలోని గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు, రోడ్ల వెంట లైటింగ్, సూచిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్, అవసరమైన చోట్ల మార్కింగ్ వేయనున్నారు. నిర్మల్ టు బైంసా, ఖానాపూర్ వైపు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బైంసాలో జరిగిన ప్రమాదం అందరిని కలచివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు.

Similar News

News February 6, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు ర్యాండమైజేషన్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ జి. రమేష్ సమక్షంలో కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించారు. 270 మంది కౌంటింగ్ స్టాఫ్, 540 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, మొత్తం 810 మంది సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్‌ను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.

News February 6, 2026

NZB: అండగా నిలవండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా: CM

image

నిండు మనసుతో అండగా నిలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా బర్దిపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్ల BRS, 12 ఏళ్ల BJP పాలనలో NZB చెత్త కుప్పలా, మురికి కూపంలా మారిందని విమర్శించారు.

News February 6, 2026

సేవాలాల్ మహరాజ్ జయంతికి సమగ్ర ఏర్పాట్లు: జాయింట్ కలెక్టర్

image

శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో గుత్తి మండలం సేవాగఢ్‌లో జయంతి ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ఆర్టీసీ బస్సులు, తాగునీరు, విద్యుత్, శానిటేషన్, వైద్య శిబిరాలు, అంబులెన్సులు ఏర్పాటు చేసి శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు.