News March 4, 2025

నిర్మల్: లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: ఎస్పీ 

image

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ నెల 8న నిర్మల్, ఖానాపూర్, భైంసా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను రాజీ చేసుకోవాలన్నారు.

Similar News

News September 16, 2025

డిగ్రీ విద్యార్థులకు అలర్ట్..రేపటితో ముగియనున్న గడువు

image

ఎన్టీఆర్: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.800 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు.

News September 16, 2025

బంట్వారం: అంగన్‌వాడీ గుడ్డులో కోడిపిల్ల

image

పౌష్టికాహారం కోసం అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన గుడ్లలో ఓ బాలింతకు కోడిపిల్ల ఉన్న గుడ్డు లభించింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News September 16, 2025

మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

image

‘స్వస్త్ నారీ- స్వశక్తి పరివార్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మహిళలకు రక్తహీనత, బీపీ, థైరాయిడ్, టీబీ పరీక్షలు నిర్వహించి, గర్భిణుకు ఆరోగ్య పరీక్షలు చేసి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించడమే ముఖ్య లక్ష్యమని వివరించారు.