News August 14, 2025
నిర్మల్: వలకు చిక్కిన ‘బొచ్చె’డంత ‘చేప’!

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన దూసం సాయినాథ్ అనే మత్స్యకారుడికి అరుదైన చేప లభ్యమైంది. గురువారం పోచంపాడు డ్యాంలో అతడు చేపల వేటకు వెళ్లగా సుమారు 25 కిలోల భారీ బొచ్చె చేప వలకు చిక్కింది. కుబీర్ వారసంతకు ఆ చేపను అమ్మకానికి తీసుకురావడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. ఇలాంటి రకమైన చేపలు అరుదుగా దొరుకుతాయని సాయినాథ్ తెలిపాడు. ఇప్పటివరకు మీరు చూసిన అతి భారీ చేప ఏది? ఎన్ని కిలోలు? ఎంత ధర పలికింది?
Similar News
News August 14, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య: DEO

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సిద్దిపేట ఈడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణరావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారంతో లక్ష రూపాయల విలువైన షూలు, ఐడి కార్డులు, బెల్టులు వంటి అందజేశారు.
News August 14, 2025
UPIలో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలు బంద్

సైబర్ నేరాలను అరికట్టేందుకు NPCI అక్టోబర్ 1 నుంచి UPI సేవల్లో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను నిలిపేయనుంది. సాధారణంగా నగదు పంపేందుకు UPI పిన్ ఎంటర్ చేయాలి. అయితే కేటుగాళ్లు ఖాతాలో నగదు జమ చేస్తామని పిన్ ఎంటర్ చేయించి నగదు దోచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఫోన్ పే, గూగుల్ పే, తదితర యూపీఐ యాప్స్ ద్వారా ఫ్రెండ్స్, సన్నిహితులకు డబ్బు చెల్లించమనే రిక్వెస్ట్ పంపడం కుదరదు.
News August 14, 2025
మావుళ్లమ్మ ఆలయ ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్

భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. హిందూ మతానికి చెందిన 13 మందిని ధర్మకర్తలుగా నియమిస్తారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలయం వద్ద దరఖాస్తులను పొందవచ్చని ఆయన తెలిపారు.