News December 27, 2025
నిర్మల్: వార్డు మెంబర్ SUICIDE

అప్పుల బాధతో వార్డు మెంబర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జల్లా దిలావర్పూర్ మం. కాల్వలో జరిగింది. SI రవీందర్ ప్రకారం.. గ్రామానికి చెందిన నరేశ్(31) GP ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా గెలిచాడు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News December 27, 2025
RGM: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు’

RGM కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్..అలైవ్’ కార్యక్రమం కింద ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించినట్లు 2025వార్షిక పోలీస్ ప్రకటనలో CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో పాటు ట్రాఫిక్ నియమాల అమలును కఠినంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల ప్రజల్లో రోడ్డుభద్రతపై అవగాహన పెరిగిందన్నారు.
News December 27, 2025
నేరాల నియంత్రణకు సమన్వయం అవసరం: VZM ఎస్పీ

నేరాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. మహిళలపై దాడుల కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యల్లో జిల్లా తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకొని 18 గ్యాంగులపై నిఘా, రూ.4 కోట్ల ఆస్తుల ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు.
News December 27, 2025
GDK: మత్తుపై ఉక్కుపాదం.. గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్!

గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టామని, అనేక NDPS కేసులు నమోదుచేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు 2025 వార్షిక పత్రికా ప్రకటనలో రామగుండం CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు, తిరిగి నేరాలకు పాల్పడితే PD యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రహిత లక్ష్యంగా ప్రత్యేక బృందాలతో చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.


