News March 21, 2026
నిర్మల్: విద్యార్థిని తేజస్విని మృతి.. కారణం ఇదే

బాసర RGUKT విద్యార్థిని తేజస్విని మృతికి ‘అక్యూట్ లుకేమియా బ్లాస్ట్ సెల్’ (బ్లడ్ క్యాన్సర్ – 4వ స్టేజి) కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు నిజామాబాద్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. అయితే అప్పటికే క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వర్సిటీ అధికారులు విచారం వ్యక్తం చేశారు.
Similar News
News April 9, 2026
కడప: 253 మందిపై కేసులు నమోదు

వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం కడప జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 253 మందిపై కేసులు నమోదు చేసి వారికి రూ.57,195 ల జరిమానా విధించారు. ద్విచక్ర వాహనం దారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పక ధరించాలని సూచించారు.
News April 9, 2026
చిత్తూరు: పునర్విభజన షెడ్యూల్‌లో మార్పులు

జిల్లాలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన షెడ్యూల్ రివైజ్ చేస్తూ రాష్ట్ర పురపాలక కమిషనర్ సంపత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. డివిజన్లు, వార్డుల డ్రాప్ట్ ప్రతిపాదనలను రూపొందించేందుకు ఈనెల 26 వరకు గడువిచ్చారు. 27 నుంచి మే 3వ తేదీ వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి సూచనలను తీసుకోవాలన్నారు. మే 30 న తుది పునర్విభజనపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుందని అందులో పేర్కొన్నారు.
News April 9, 2026
ఆదోనిలో బాల్యవివాహం అడ్డగింత

ఆదోనిలోని తిరుమల నగర్‌లో బాల్యవివాహం జరగబోతోందనే సమాచారం అందడంతో అధికారులు బుధవారం అప్రమత్తమయ్యారు. ఇద్దరు మైనర్లకు పెళ్లి జరుపుతున్నారన్న సమాచారంతో శక్తి టీం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టింది. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం చట్టరీత్యా నేరమని వివరించారు. ఆదేశాలు పాటించకపోతే కేసులు నమోదు చేసి, పిల్లలను చైల్డ్ హోమ్‌కు తరలిస్తామని హెచ్చరించారు.


