News April 5, 2025
నిర్మల్: విషాదం.. బర్త్ డే మరుసటి రోజే మృతి

నిర్మల్(D) జిల్లా <<15990097>>బాసర వేద పాఠశాలలో చదవుతున్న హన్మకొండ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. శాయంపేటకు చెందిన మణికంఠ 2ఏళ్ల క్రితం బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. నిన్న గోదావరి నదికి హారతి ఇవ్వడానికి వెళ్లి మోటార్‌ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. కాగా, మణికంఠ బర్త్ డే తర్వాతి రోజే ఈఘటన జరిగింది. కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 13, 2026
శివయ్య చేతిలో త్రిశూలం ఎందుకు?

శివుని చేతిలోని త్రిశూలం సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక. ఈ 3 శక్తులు ఆయన ఆధీనంలో ఉంటాయని, వాటిని సమన్వయం చేస్తూ ఆయన సృష్టిని నడిపిస్తారని అర్థం. అలాగే జ్ఞానం, ఇచ్చాశక్తి, క్రియాశక్తిని సూచిస్తుంది. భక్తుల హృదయాల్లోని అజ్ఞానాన్ని నశింపజేసి, పరిపూర్ణంగా ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. అంతటి శక్తి త్రిశూలానికి ఉంటుంది. ఇది మానవునిలోని అరిషడ్వర్గాలను జయించి, ముక్తిని పొందే మార్గాన్ని బోధిస్తుంది.
News February 13, 2026
కాసేపట్లో కౌంటింగ్.. మున్సి‘పల్స్’ పట్టేదెవరో?

TG: రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉ.8 గంటలకు మొదలు కానుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారి భవితవ్యం సాయంత్రంలోగా తేలనుంది. 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. దీనికోసం అధికారులు అంతా సిద్ధం చేయగా ప్రతి గదిలోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. గెలిచిన అభ్యర్థులు ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేస్తారు.
News February 13, 2026
ఖమ్మం: భక్తులకు గమనిక

మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాలకు, స్థానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డి పల్లి, మోతేగడ్డ, బెండలపాడు దేవాలయాలకు స్థానిక డిపోల-79 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.


