News March 1, 2025

నిర్మల్: వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి: డీఈవో

image

నూతన ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి రామారావు అన్నారు. శుక్రవారం 2024 ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ తరగతులను పంచ సీల్ కళాశాలలో నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరూ తమ సర్వీసులో విద్యార్థులకు ఏ విధంగా క్రమశిక్షణతో వెలిగి పురోగతి సాధించాలో శిక్షణ అందించారు. ఎంఈఓ నర్సయ్య, విజయ్ కుమార్, అశోక్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2025

ఒంగోలు: బాలికను గర్భవతిని చేశాడు.. పరారయ్యాడు

image

తన పిన్ని కూతురు బర్త్ డే పార్టీ ఇస్తున్నట్లుగా నమ్మించి ఆరిఫ్ బాలికను తన గదికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆ యువకుడు పరారయ్యాడు. ఒంగోలులో ఓ బాలిక తన స్నేహితుడి ద్వారా పరిచయమైంది. బాలికపై కన్నేసిన యువకుడు ఇన్స్టాగ్రామ్‌లో రోజూ చాట్ చేస్తూ పరిచయాన్ని పెంచుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News March 1, 2025

పి.గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

పి.గన్నవరం బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన ట్రక్కు ఆటో డ్రైవర్ ఇంజరపు రామకృష్ణ (37) మృతి చెందాడు. రాజమండ్రి నుంచి ఈదరాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలికిపురం నుంచి ఆలమూరు వెళ్తున్న ట్రాక్టర్ – ఆటో ఢీ కొనడంతో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పి.గన్నవరం ఎస్ఐ శివకృష్ణ కేసు నమోదు చేశామన్నారు.

News March 1, 2025

యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు:ఎస్ఐ 

image

పెళ్లి చేసుకుంటానని మహిళను గర్భవతిని చేసి ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకోను అని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాధితురాలు (25) ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకి చెందిన చిర్రా మహేష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

error: Content is protected !!