News February 16, 2025

నిర్మల్: శెభాష్.. సాయి సహస్ర

image

నిర్మల్‌లో నిర్మించిన చేపల మార్కెట్‌ నిరుపయోగంగా ఉంటోంది..రోడ్డుపైనే విక్రయిస్తుంటే ప్రజలు కొంటున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది..ఇది గమనించిన చిన్నారి సాయిసహస్ర నేరుగా కలెక్టర్ దగ్గరకు వెళ్లింది. మార్కెట్ అందుబాటులోకి రాక పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకెళ్లింది. సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చింది. బాలిక ధైర్యంగా కలెక్టర్ దగ్గరకు వెళ్లడంతో ప్రజలు అభినందిస్తున్నారు.

Similar News

News September 17, 2025

కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల మోసం: మంత్రి పొంగులేటి

image

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ రూ. లక్ష కోట్లు మోసం చేశారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం నేలకొండపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని, అభివృద్ధి, సంక్షేమం 2 సమానంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఇళ్లు నిర్మిస్తే కమీషన్ రాదనే ఉద్దేశంతోనే కేసీఆర్ పేదల ఇళ్లను నిర్మించలేదన్నారు.

News September 17, 2025

తిరుమలలో పులివెందుల వాసి మృతి

image

తిరుమలలో బుధవారం శ్రీవారి భక్తుడు మృతి చెందాడు. టీటీడీ అధికారుల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల తాలూకా పార్నపల్లికి చెందిన శ్రీవారి భక్తుడు తిరుమల అద్దె గదుల ప్రాంతంలోని ఓ బాత్రూంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

మెదక్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

image

హైదరాబాద్ అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం PLAN INTERNATIONAL ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.