News October 19, 2025
నిర్మల్: శ్రీరామ్‌సాగర్ ఎస్కేప్ గేట్ల ద్వారా వరదనీటి విడుదల

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల ద్వారా వరద నీటిని గోదావరి నదిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 6654 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 6654 క్యూసెక్కులుగా నమోదైంది. వరద ఉద్ధృతి దృష్ట్యా మత్స్యకారులు, సామాన్య ప్రజలు ఎవరూ నదిలోకి దిగరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 19, 2025
ఇంద్రవెల్లి: దండారీ ఉత్సవాలు పాల్గొన్న ADB ఎస్పీ

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్‌పెన్‌కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశారు. అదివారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఏర్పాటు చేసిన గుస్సాడీ దండారీ ఉత్సవాలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ప్రసాద్ హాజరయ్యారు. గుస్సాడీలతో కలసి కోలాటం ఆడుకున్నారు.
News October 19, 2025
నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

నంద్యాల సమీపంలోని చిన్నచెరువు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఆదివారం రాత్రి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన హుసేన్ బాష మృతిచెందగా, బుక్కాపురం గ్రామానికి చెందిన మల్లేశ్, సువర్ణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
NGKL: ఆ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ

దీపావళి పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుభాకాంక్షలు తెలిపారు. నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ వధించిన రోజు దీపావళి అన్నారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.