News March 6, 2025
నిర్మల్: సదరం కార్డుల జారీ పకడ్బందీగా నిర్వహించాలి

ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం) కార్డుల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియపై అధికారులతో సమావేశం నిర్వహించారు. యూడీఐడీ పోర్టల్ ద్వారా దివ్యాంగులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
Similar News
News November 12, 2025
NZB: ఈ గురువారం పెళ్లి.. అంతలోనే వరుడి ఆత్మహత్య

ఈ గురువారం పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన NZB(D) ఎడపల్లి(M)లో జరిగింది. మంగల్ పాడ్ గ్రామానికి చెందిన రేవూరి ప్రతాప్ గౌడ్‌కు పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం పోచమ్మ పండగ ఉండగా.. గ్రామ శివారులోని గుట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పెళ్లి సందడితో ఉన్న రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 12, 2025
నల్గొండకు నేషనల్ అవార్డు

జల్ సంజయ్ జన్ భాగిదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంకు వచ్చింది. రాష్ట్రంలో నల్గొండతో పాటు ఆదిలాబాద్ మంచిర్యాల జల సంరక్షణలో టాప్‌లో నిలిచిన విషయం విదితమే. ఈ పథకాన్ని పక్కాగా అమలు పరిచినందుకు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు జిల్లాకు రావడం తొలిసారి. కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవ వల్లే ఇది సాధ్యమైంది. ఈ పురస్కారం కింద రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది.
News November 12, 2025
మందమర్రి: సింగరేణిలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి కృషి: బలరాం

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని 100 మిలియన్ టన్నులకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు సీఅండ్ఎండీ బలరాం తెలిపారు. హైదరాబాద్‌లో కార్మిక సంఘాలతో నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మెడికల్ అటెండెంట్ నిబంధనలు సరళతరం చేస్తామని, ప్రమాద రహిత ఉత్పత్తికి అందరూ సహకరించాలన్నారు. కార్మిక సంఘాలు కూడా ఈ లక్ష్యంపై సానుకూలత వ్యక్తం చేశాయి.


