News February 6, 2025

నిర్మల్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో సుమారు 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News April 2, 2026

బాపట్ల: హైవేపై ప్రమాదం.. ఇద్దరి మృతి

image

చీరాల విజయనగర కాలనీ సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న ఇద్దరిని ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయిన వారి పేర్లు తెలియాల్సి ఉంది.

News April 2, 2026

వరంగల్: అమ్మా.. నాన్న.. మేమేం పాపం చేశాం!

image

‘మేం అడగకుండానే జన్మనిచ్చారు. మంచి జీవితాన్నిస్తారని అనుకునేలోపే మా జీవితాల్లో విషాదం నింపారు. అమ్మా.. నాన్న.. మేమేం పాపం చేశాం. మీరు పడిన గొడవలకు బలి చేశారు. బంగారు భవిష్యత్తు కోసం కలలుకనే క్షణాల్లోనే మీ గొడవల్లో మమ్మల్నీ లాగి మీతో పాటు మా జీవితాల్నీ చిదిమేశారు. చంపాలని అనుకున్నప్పుడు జన్మ ఎందుకిచ్చారు?’ అని వరంగల్(D)లో <<19544223>>తల్లిదండ్రుల గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన<<>> ఐదుగురు చిన్నారుల ఆత్మ ఘోషిస్తోంది.

News April 2, 2026

ఈనెల 16 నుంచి కేయూ ఎస్డీఎల్సీఈ పరీక్షలు

image

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రం ఎం.ఎల్.ఐ.ఎస్సీ 2వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16, 18, 21 తేదీల్లో మ.2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 24 నుంచి బి.ఎల్.ఐ.ఎస్సీ. రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.