News December 4, 2025

నిర్మల్: సర్పంచ్ బరిలో దివ్యాంగుడు

image

ప్రజాసేవకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించేందుకు శంకర్ సిద్ధమయ్యాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల–బి నుంచి సర్పంచ్‌ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశాడు. 2 చేతులు లేకున్నా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టాడు. శంకర్ నామినేషన్ వేసిన వెంటనే గ్రామస్థులు అతడిని అభినందించారు. రాజకీయాలు దివ్యాంగులకు అందని ద్రాక్ష కాకూడదని, తాము కూడా ప్రజాసేవలో ముందుంటామని శంకర్ నిరూపించాడు.

Similar News

News December 4, 2025

VJA: పాత పైపు లైన్‌లకు చెక్.. త్వరలో 300 కి.మీ DPR తయారీ.!

image

విజయవాడ నగరంలో పాత పైపులైన్ల లీకులు, డ్రైనేజీల పక్కన ఉండటం వల్ల నీరు కలుషితమై ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, అధికారులు యుద్ధప్రాతిపదికన అత్యవసర ప్రాంతాల్లో పాత పైపులు తొలగించి కొత్తవి వేస్తున్నారు. నగరంలో సుమారు 300 కి.మీ పైపులైన్లు మార్చాల్సి ఉంది. దీనికి ₹80-90 కోట్లు ఖర్చవుతుందని, త్వరలో DPR ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు.

News December 4, 2025

దేశ సేవలో అన్నదమ్ములు..

image

నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు అగ్నివీరులుగా ఎంపికయ్యారు. మహబూబ్ బాషా కుమారులు అబ్దుల్ నబీ, మహమ్మద్ ఇర్ఫాన్ అగ్నివీర్ నియామకాల్లో ప్రతిభ చూపారు. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహమ్మద్ ఇర్ఫాన్ రాజస్థాన్‌లో, అబ్దుల్ నబీ హిమాచల్‌ప్రదేశ్‌లో విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. దేశ సేవకు అంకితమైన వారిని స్థానికులు అభినందించారు.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్‌ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.