News February 22, 2025
నిర్మల్: సీఎంఆర్ బియ్యం అక్రమాలపై కఠిన చర్యలు: కలెక్టర్

సీఎంఆర్ బియ్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన 8 నెలలలో సీఎంఆర్ బియ్యం అక్రమాలు చేసిన పలు రైస్ మిల్లు యాజమాన్యాలపై చర్యలు తీసుకొని, రికవరీకి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
ఢిల్లీలో ఆత్మాహుతి దాడి? కారులో ఉన్నది అతడేనా?

ఢిల్లీ పేలుడు ఆత్మాహుతి దాడేమోనని ఇన్వెస్టిగేషన్ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పుల్వామాకు చెందిన సల్మాన్ నుంచి డా.ఉమర్ మహ్మద్ i20 కారు తీసుకున్నట్లు భావిస్తున్నాయి. బ్లాస్ట్‌కు ముందు కారులో బ్లాక్ మాస్క్‌తో ఉన్నది ఉమరేనా అనే కోణంలో విచారణ చేపట్టాయి. ప్లాన్ ప్రకారమే అతడు కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా? అని ఆరా తీస్తున్నాయి.
News November 11, 2025
పదేళ్లుగా బ్యాంకు ఖాతాల్లో నిలిచిపోయిన నగదు

తూ.గో జిల్లాలోని పలు బ్యాంకుల్లో లావేదేవీలు జరగకపోవడంతో పదేళ్లలో రూ.97.12 కోట్లు ఖాతాదారుల ఖాతాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యక్తి గత ఖాతాలు 5,09,614 కాగా నగదు రూ.75.05 కోట్లు ఉందన్నారు. పరిశ్రమలు ఖాతాలు 20,180 కాగా రూ.4.21 కోట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ ఖాతాలు 5,154 కాగా రూ.4.21 కోట్లుగా నిర్ధారించారు. ఈ నగదు e-KYC, నామినీ పేర్లు తదితర వివరాలు సరిగా లేకపోవడంతో బ్యాంకులో నిల్వ ఉందన్నారు.
News November 11, 2025
ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


