News March 28, 2024
నిర్మల్ : సీఎంఆర్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్
ప్రభుత్వం సూచించిన గడువులోగా (సీఎంఆర్) కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రైస్‌మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సీఎంఆర్ లక్ష్యాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాల పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ 2023-24 సంవత్సరం లక్ష్యాలను గడువులోగా వెంటనే పూర్తి పూర్తిచేయాలని తెలిపారు
Similar News
News January 11, 2025
జైపూర్: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బెస్ట్ అవార్డు
జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవార్డును అందుకుంది. శుక్రవారం న్యూదిల్లీలో జరిగిన 3వ జాతీయ పవర్ జనరేషన్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు లభించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యల్పంగా నీటిని వినియోగించినందుకు అవార్డును అందుకున్నట్లు అధికారి D.పంతుల తెలిపారు.
News January 11, 2025
నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండవ గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
News January 11, 2025
ADB: ఘనంగా ముగిసిన పోలీస్ స్పోర్ట్స్ మీట్
ఆదిలాబాద్ పట్టణంలోని ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి విజేతలుగా నిలిచిన వారిని ఎస్పీ గౌస్ ఆలం అభినందించి, పతకాలను అందజేశారు. పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఏఎస్పీ కాజల్, సురేందర్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు తదితరులున్నారు.