News July 21, 2024
నిర్మల్: సొంత ఇంట్లోనే బంగారం చోరీ.. భర్త అరెస్ట్

సొంత ఇంటిలోనే దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మహదేవపురం కాలనీలో నివాసముండే ఓ మహిళ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది. ఈనెల 19న పాఠశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో 8 తులాల బంగారం, 6 తులాల వెండి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా ఆమె భర్త దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
Similar News
News September 4, 2025
ADB: 7న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం

ప్రముఖ తత్వకవి ఉదారి నాగదాసు స్మారక కవితా అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి కరీంనగర్ వాసి తోట నిర్మలారాణికి అవార్డును కమిటీ ప్రకటించిందని నిర్వాహకులు డా.ఉదారి నారాయణ తెలియజేశారు. ఈ అవార్డును సెప్టెంబర్ 7న జిల్లా పరిషత మీటింగ్ హాల్‌లో మద్యాహ్నం మూడు గంటలకు అవార్డు ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డు కింద రూ.5 వేల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
News September 4, 2025
ఉపాధ్యాయుల పాత్ర కీలకం : ADB కలెక్టర్

ఒక వ్యక్తి ఉన్నతస్థానానికి ఎదగడంలో, భవిష్యత్తుకు పునాదులు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉన్నతస్థాయికి చేరాలంటే గురువు అవసరం తప్పనిసరని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి తగిన గౌరవాన్ని ప్రభుత్వం ఇస్తోందని, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏఐ ద్వారా బోధించేలా టీచర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
News September 3, 2025
నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించండి: ఆదిలాబాద్ SP

గణేష్ నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.