News January 1, 2026
నిర్మల్: స్కాలర్ షిప్ దరఖాస్తు తేదీ పొడిగింపు

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఇంటర్, డిగ్రీ, సాధారణ వృత్తి నైపుణ్య కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తు తేదీ పొడిగించినట్లు ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి దయానంద్ తెలిపారు. దరఖాస్తు గడువు మార్చి 31, 2026 వరకు పొడిగించామన్నారు. విద్యార్థులు www.telangana.epass వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 5, 2026
తూప్రాన్: ఎన్నికల బరిలో తోటి కోడలు

తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి ఎన్నికల బరిలో తోటి కోడళ్లు పోటీ చేస్తున్నారు. ఒకరు తాజా మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు నూతనంగా ఎన్నికల బరిలో నిలిచారు. తూప్రాన్ మున్సిపల్ పరిధి 12వ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆమె తోటి కోడలు బొంది రజిని రాఘవేందర్ గౌడ్ 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త రాఘవేందర్ గౌడ్ ఇదే వార్డులో తాజా మాజీ కౌన్సిలర్‌గా ఉన్నారు.
News February 5, 2026
అక్షరాస్యతే లక్ష్యంగా అక్షరాంధ్ర: కలెక్టర్

నంద్యాల జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యంగా అక్షరాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బుధవారం నంద్యాలలోని విశ్వ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో 1,00,686 మందిని అక్షరాస్యులుగా మార్చడమే తమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
News February 5, 2026
కడప ట్రాఫిక్ PSలో SP ఆకస్మిక తనిఖీ

కడపలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగు పరచడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.


