News February 27, 2025

నిర్మల్: 109 మంది ఓటేశారు..!

image

నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం జిల్లాలో మొత్తం 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులు తెలిపారు.

Similar News

News February 14, 2026

కాషాయ కోటగా కరీంనగర్.. చరిత్రలో తొలిసారిగా..!

image

కరీంనగర్ తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత, తొలిసారిగా ఒక మున్సిపల్ కార్పొరేషన్‌పై BJP మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఉత్తర తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (MCK) ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

News February 14, 2026

సంగారెడ్డి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, ఇస్నాపూర్ సహా అన్ని కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి లెక్కింపును విజయవంతం చేశారని, ఫలితాల అనంతరం విజేతలకు ధృవీకరణ పత్రాలు అందజేశామన్నారు.

News February 14, 2026

శివరాత్రి: పూజలో వాడకూడని వస్తువులివే!

image

శివపూజలో కొన్ని వస్తువులు నిషిద్ధం. బ్రహ్మదేవుని అబద్ధానికి సహకరించినందుకు మొగలి పువ్వు, జలంధర సంహార కారణంగా తులసి దళాలు శివ పూజకు వాడరు. శివుడు వైరాగ్యమూర్తి కావడంతో సౌభాగ్య చిహ్నాలైన పసుపు, కుంకుమలు లింగంపై నిషిద్ధం. అయితే పానవట్టంపై వాడొచ్చు. అలాగే కొబ్బరికాయ సమర్పించినా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయరాదు. వీటికి బదులుగా విభూతి, బిల్వదళాలు, పాలు, గంగాజలంతో పూజించాలి. తద్వారా సకల శుభాలు కలుగుతాయి.