News July 9, 2025
నిర్మల్: ‘15 తేదీలోగా దరఖాస్తు చేసుకోండి’

జిల్లాలో పదో తరగతి చదువుతున్న దివ్యాంగుల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని డీఈవో రామారావు తెలిపారు. మార్చి 2026లో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని నింపి దివ్యాంగుల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతచేసి ఈనెల 15వ తేదీలోగా ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందించాలని సూచించారు.
Similar News
News July 9, 2025
MBA కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.
News July 9, 2025
రైతుబజార్‌ను వినియోగించుకోవాలి: సిరిసిల్ల డీఏవో

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతుబజార్‌ను కూరగాయలు, మటన్, చికెన్, చేపల విక్రయదారులు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి అఫ్జల్‌బేగం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతుబజార్‌లోకి తరలించేందుకు అవసరమైన షెడ్లను నిర్మిస్తున్నామన్నారు. అదే విధంగా ఈ రైతుబజార్‌లోకి మాంసం షాప్‌లను సైతం తరలించాలని చెప్పారు.
News July 9, 2025
ఓయూ బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 24లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.200 లేట్ ఫీతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.