News March 19, 2025

నిర్మల్‌: 204 మంది పరీక్ష రాయలే..!

image

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 204 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తం 6167కి 5963 మంది విద్యార్థులు పరీక్ష రాశారన్నారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News March 19, 2025

సునీత విషయంలో రాజకీయం!

image

సునీత, విల్మోర్ 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా బోయింగ్ స్టార్ లైనర్‌లో సమస్యలతో అక్కడే ఉండిపోయారు. అప్పటికే బోయింగ్ కంపెనీకి చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన ఇలాంటి యాత్రలకు బైడెన్ సర్కార్ ఆ కంపెనీనే సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఎలాన్ మస్క్ ట్రంప్ అధికారంలోకి రాకముందు వారిని తీసుకొస్తే బైడెన్‌కు మైలేజీ పెరుగుతుందని ఆలస్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News March 19, 2025

పుంగనూరులో 32 మంది కానిస్టేబుళ్ల బదిలీ

image

పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లను భారీగా బదిలీ చేశారు. ఏకంగా 32 మందిని బదిలీ చేస్తూ చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇద్దరినీ వీఆర్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన సిబ్బందిని వెంటనే రిలీవ్ చేయాలని.. కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో రిపోర్ట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.

News March 19, 2025

సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు: నాసా

image

అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయని తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ యాత్రను విజయవంతం చేయడంలో స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ యాత్రలో సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని వివరించింది.

error: Content is protected !!