News September 20, 2025

నిర్మల్: 22 నుంచి టాస్ పరీక్షలు

image

ఈనెల 22 నుంచి 28 వరకు టాస్ పదో, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్మల్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తెలిపారు. పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మెరత్ పేట్‌లో పరీక్ష కేంద్రం కలదని, ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాల ఈదిగాంలో పరీక్షా కేంద్రం ఉంటుందని వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయన్నారు.

Similar News

News September 20, 2025

సంగారెడ్డి: ‘డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తుల జప్తు’

image

డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎంఆర్ అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్ఓ బాల సరోజ, సివిల్ సప్లై డీఎం రాజేశ్వర్ పాల్గొన్నారు.

News September 20, 2025

నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలి?

image

ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూడటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మన అరచేతిలో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవి(పార్వతి) కొలువై ఉంటారని అంటున్నారు. చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి, మూలంలో పార్వతీ దేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఉదయం నిద్రలేవగానే అరచేతులు చూసుకోవడం, వాటిని కళ్లకు అద్దుకోవడం ద్వారా ఆ ముగ్గురు దేవతల ఆశీస్సులు లభించి, అదృష్టం వరిస్తుందని నమ్మకం.

News September 20, 2025

ప్రార్థన ఎలా చేయాలి?

image

ప్రార్థన అంటే నోటితో పలికే మాట కాదు. అది మనసులో నుంచి రావాలి. ఈ దైవ స్ఫురణలో ప్రేమ, భక్తి జాలువారాలి. అప్పుడే మనసులోని చీకటి తొలగిపోయి, దైవ కాంతి ప్రకాశిస్తుంది. మన కోర్కెలు తీర్చే ఆ భగవంతుడికి మనం ఏమి కోరుతామో ముందే తెలుస్తుంది. అందుకే ప్రత్యేకంగా ఆయనను ఏదీ అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఏది ఇస్తే అది మనకు మహద్భాగ్యమని భావించాలి. ఇదే నిజమైన ప్రార్థన.