News March 6, 2025

నిర్మల్: 2nd ఇయర్ పరీక్షకు 296 గైర్హాజరు

image

గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,102 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,172, ఒకేషనల్ విభాగంలో 634 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా, 296 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News March 6, 2025

ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

image

దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంతత్రి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల బ్రిడ్జి వద్ద లారీని ఢీకొన్న దుర్ఘటన అత్యంత విషాదకరమన్నారు.

News March 6, 2025

ఏపీకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల

image

APకి ఏ లోటు లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామన్నారు. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇప్పిస్తున్నామని వెల్లడించారు. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సాయం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్నింటా కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

News March 6, 2025

NRPT: రెండో రోజు పరీక్షలకు 71 మంది గైర్హాజరు

image

నారాయణపేట జిల్లాలో రెండో రోజు గురువారం ఇంటర్ పరీక్షలకు 71 మంది గైర్హాజరు అయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం 3,803 మంది విద్యార్థులకు గాను, 3,732 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 71 మంది పరీక్షలకు హాజరు కాలేదని చెప్పారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!