News March 18, 2025
నిర్మల్: 522 మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 522 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తం 7343కి 6821 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News September 13, 2025
ఆమిర్ ఖాన్ తనయుడి సినిమాలో సాయిపల్లవి

సౌత్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తొలుత ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. తాజాగా దానిని ‘మేరే రహో’గా మార్చారు. ఈ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12కు వాయిదా వేశారు. ఇది సాయిపల్లవికి హిందీలో డెబ్యూ మూవీ కానుంది. ఆమె రణ్‌బీర్ ‘రామాయణ’ మూవీలోనూ నటిస్తున్నారు.
News September 13, 2025
NGKL: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సల్వాది బాలయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వ్యక్తి. అచ్చంపేట, సిద్దాపూర్, ఆమనగల్, మహబూబ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య మృతి పట్ల తోటి పోలీసు సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు.
News September 13, 2025
ప్రొద్దుటూరు: టీవీ చూడొద్దన్నందుకు ఆత్మహత్య

పనీపాటా లేకుండా పొద్దస్తమానం టీవీ చూస్తుంటే జీవనం ఎలా గడుస్తుందని తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. YMR కాలనీలో నివాసం ఉంటున్న హమాలి వర్కర్ రంగనాయకులు కుమారుడు మాణిక్యం శుక్రవారం ఉదయాన్నే టీవీ చూస్తుండటంతో తల్లి మందలించింది. మనస్తాపం చెందిన మాణిక్యం(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.