News April 22, 2025
నిర్మల్: GOOD NEWS.. 25న జాబ్ మేళా

ఇంటర్ విద్యార్థులకు HCL TechBee సంస్థ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ మేళా ఉంటుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఐఈఓ జాదవ్ పరశురాం సోమవారం తెలిపారు. ఈనెల 25 పట్టణంలోని ఎస్‌ఎస్ కంప్యూటర్ ఆఫ్ టెక్నాలజీ న్యూ బస్టాండ్ వద్ద డ్రైవ్ ఉంటుందన్నారు. ఉదయం 9 గంటలకు ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ విద్యార్థులు రావాలన్నారు. కనీస ఉత్తీర్ణత శాతం 75గా ఉన్నావారు అర్హులని పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు జెడ్డాలో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు. మోదీ, సల్మాన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో ఒప్పందాలపై సంతకాలతో పాటు ఆర్థిక, మిలిటరీ భాగస్వామ్యం, రాజకీయ సంబంధాలపై చర్చ జరగనుందని సౌదీలోని భారత అంబాసిడర్ అజాజ్ ఖాన్ వెల్లడించారు.
News April 22, 2025
శ్రీకూర్మం: పుణ్యక్షేత్రంలో.. పాపం చేసింది ఎవరు..?

శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ కూర్మనాధుని క్షేత్రంలో తాబేళ్లు మృతిచెందిన ఘటన సోమవారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాబేళ్లను ఆలయ శ్వేతపుష్కరని సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేయడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. పుణ్యక్షేత్రంలో పాపం చేసింది ఎవరు? తాబేళ్లు మృతిపై ఆలయ సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారు? దీని వెనుక కారణాలు ఏంటి.. కారకులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
News April 22, 2025
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్‌ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.