News February 21, 2026

నిర్మల్: HAPPY 100th BIRTHDAY

image

నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడకి చెందిన బియ్యాల లచ్చమ్మ 101వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శతక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూతుళ్లు, మనుమలు, మునిమనుమల మధ్య ఆమె కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. నేటి కాలంలో 50 ఏళ్లు దాటడమే కష్టంగా మారుతున్న తరుణంలో, 100 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఆమె ఆరోగ్యంగా ఉండటం విశేషం.

Similar News

News February 21, 2026

MNCL: కాంగ్రెస్ నామినేటెడ్ పదవులపై గంపెడాశలు

image

జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ శ్రేణులు గంపెడాశతో ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా గ్రంథాలయ సంస్థ, దేవాదాయ శాఖ పదవుల కోసం పోటీ నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. సీనియర్ నాయకులు రాష్ట్రస్థాయి పదవుల కోసం మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధిష్ఠానం ఎప్పుడు కరుణిస్తుందోనని వేచి చూస్తున్నారు.

News February 21, 2026

NTR: ఆ 2 రైళ్లు మరో 4 వారాలు పొడిగింపు

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా విశాఖపట్నం(VSKP), చర్లపల్లి(CHZ) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబరు 08579 VSKP- CHZ మధ్య నడిచే రైలును మార్చి 6 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం, నంబరు 08580 CHZ- VSKP మధ్య నడిచే రైలును మార్చి 7 నుంచి 28 వరకు ప్రతి శనివారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News February 21, 2026

మదనపల్లె: ఆమె దొరికితేనే..!

image

మదనపల్లెలో బాలిక హత్యాచారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. నిందితుడు కులవర్ధన్ చనిపోగా.. అతని తల్లి అంజలిని A2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఆమె దొరికితే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న అంజలి హత్యాచారం జరిగిన సోమవారం ఇంట్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కులవర్ధన్ బాలికపై హత్యాచారం చేయడం చూసి రాత్రి బెంగుళూరుకు పారిపోయినట్లు తెలస్తోంది.