News August 29, 2025

నిర్మల్: HYDకు ఈ మార్గల్లో వెళ్లండి: ఎస్పీ

image

ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులకు ఎస్పీ జానకి షర్మిల ముఖ్య సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయం కావడంతో దారి మళ్లించినట్లు చెప్పారు. వాహనదారులు నిర్మల్ వద్ద ఉన్న కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమవైపు తిరిగి, మామడ, ఖానాపూర్, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ మార్గాన్ని అనుసరించి సురక్షితంగా ప్రయాణించాలని ఆమె సూచించారు.

Similar News

News September 1, 2025

జగన్‌తో ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు

image

పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జడ్పీటీసీలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. అందరితో జగన్ చర్చించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చేయాల్సిన కార్యాచరణలపై చర్చించారు.

News September 1, 2025

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు <<17393463>>రద్దు<<>> చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News September 1, 2025

MNCL: ‘పెన్షన్ భిక్ష కాదు.. విశ్రాంత ఉద్యోగుల హక్కు’

image

పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బి.కృష్ణ, గుండేటి యోగేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. పెన్షన్ భిక్ష కాదు.. విశ్రాంత ఉద్యోగుల హక్కు అని అన్నారు. రిటైరై ఏడాదిన్నర గడిచిన ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదని తెలిపారు.