News April 23, 2025
నిర్మల్: INTER RESULTSలో అమ్మాయిలదే పైచేయి

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్ ఫలితాల్లో బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ప్రథమ సంవత్సరంలో బాలురు 43.54 శాతంతో ఉత్తీర్ణత సాధించగా బాలికలు 70.84 శాతం మంది పాసయ్యారు. సెకండియర్‌లో ఉత్తీర్ణత శాతం బాలురది 54.31గా ఉండగా బాలికలు 80.93గా సాధించారు. జిల్లాల మొత్తానికి ఫలితాల సాధనలో బాలికలదే పైచేయి సాధించారు.
Similar News
News April 23, 2025
టెస్లాకే టైం కేటాయిస్తా: మస్క్

మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్‌పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు.. 13వ స్థానానికి చేరుకున్న నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో టెన్త్ ఫలితాలు గతేడాదితో పోల్చితే ఆశాజనకంగా నమోదయ్యాయి. గతేడాది 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో జిల్లా నిలవగా.. తాజాగా 83.58 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు.
News April 23, 2025
టెర్రరిస్టుల దాడిని ఖండించిన నారాయణపేట ఎమ్మెల్యే

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి తెలిపారు. మరికల్ మండలం అప్పంపల్లిలో ఆమె మాట్లాడారు. తీవ్రవాదులు సామాన్య జనాలపై దాడులు నిర్వహించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరన్న, సూర్య మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి ఉన్నారు.