News March 6, 2025
నిర్మల్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
Similar News
News April 5, 2026
టెన్త్, ఇంటర్ ఫలితాలు.. UPDATE

AP: రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఫలితాలను ఈ నెలలోనే పది రోజుల తేడాతో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 9తో పూర్తవుతుంది. మార్కులను ఆన్‌లైన్‌లోకి ఎక్కించి ఈ నెల 15 తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక టెన్త్ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 15 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత రిజల్ట్స్‌ను ప్రాసెస్ చేసి ఈ నెల 25 తర్వాత విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
News April 5, 2026
నంద్యాల: రేపు రూ.60 వేలు గెలుచుకునే ఛాన్స్!

రుద్రవరం మండలం చిన్నకంబలూరులో సోమవారం రాష్ట్రస్థాయి న్యూ కేటగిరీ వృషభరాజముల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గుడ్ ఫ్రైడే – ఈస్టర్ పర్వదిన వేడుకలను పురస్కరించుకొని గ్రామానికి చెందిన క్రైస్తవ సంఘ పెద్దలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. గెలుపొందిన వృషభరాజముల యజమానులకు నగదు బహుమతులను వరుసగా రూ.60,000, రూ.50,000, రూ.40,000, రూ.30,000 అందించనున్నట్లు వెల్లడించారు.
News April 5, 2026
కర్నూలు: 205 ఉద్యోగాలకు ఎల్లుండే ఇంటర్వ్యూ

కర్నూలులోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారిణి దీప్తి తెలిపారు. ఇన్నోవిజన్, GPS రెన్యవబుల్ ఎనర్జీ, బ్లూస్లార్, అంబర్ తదితర సంస్థలు ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 205 ఖాళీలున్నాయని, 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.


