News April 4, 2025
నిర్మల్: ‘LRS రాయితీకి ఏప్రిల్ 30 వరకు అవకాశం’

ఎల్ఆర్ఎస్ పథకంలో 25% రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పెంచిందని మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరి భువన్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి స్పందన లేకపోవడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగ పర్చుకోవాలని ఆయన కోరారు.
Similar News
News November 11, 2025
పాపం.. ప్రశాంత్ కిశోర్

దేశంలోని అనేక పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీలు సొంత రాష్ట్రంలో తన పార్టీకి మాత్రం ఉపయోగపడలేదు. ‘జన్ సురాజ్’ ద్వారా బిహార్ గతిని మారుస్తానంటూ చేసిన ఆయన ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఇవాళ వెలువడిన అనేక ఎగ్జిట్ పోల్స్.. PK పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టమేనని తేల్చాయి. అనేక పార్టీలకు అధికారం తెచ్చానన్న ఆయన మాత్రం గెలుపు దరిదాపుల్లోకీ రాలేకపోయారు.
News November 11, 2025
జూబ్లీ పల్స్: ఎగ్జిట్ పోల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు!

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు INC వైపు మొగ్గు చూపాయి. 2వ స్థానంలో BRS నిలుస్తుందని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసిన BJPకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. కీలకమైన సర్వేల్లోనూ కమలం కనీసం 10శాతం ఓటింగ్ రాబడుతుందని చెప్పలేకపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌ను SMలో పెడుతూ BJP కీలక నేతల మీద ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.
News November 11, 2025
FINAL UPDATE: జూబ్లీహిల్స్‌లో 48.43% పోలింగ్ నమోదు

నాయకులను ఎన్నుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారని మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి బాబు ఓటింగ్‌కు అంటే జూబ్లీహిల్స్‌లో ఆమడ దూరం పోయారు. కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. వాలంటీర్లు సేవ చేశారు. మొబైల్ భద్రపరిచేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. గంటసేపు ఓటింగ్ పెంచారు. అయినా సగానికి పైగా ఓటెయ్యలేదు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీలోనే ఓటింగ్ 48.43% నమోదు కావడం గమనార్హం.


