News March 9, 2025
నిర్మల్: MLC రేసులో రేఖానాయక్?

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!
Similar News
News October 26, 2025
NTR: నకిలీ మద్యం కేసు.. కస్టడీ పిటిషన్లపై రేపు విచారణ

నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల కస్టడీ పిటిషన్లపై సోమవారం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో A7గా ఉన్న బాదల్‌దాస్, A8 ప్రదీప్‌దాస్, A15 రమేశ్, A16 అల్లా భక్షు, A17 సతీశ్‌బాబులను 10 రోజుల కస్టడీ కోరుతూ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు విజయవాడ ఎక్సైజ్ కోర్టు విచారణ జరపనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
News October 26, 2025
కాకినాడ జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు

తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. రూరల్ 7, అర్బన్ 16, తాళ్ళరేవు 20, కరప 1, కాజులూరు 26, పెదపూడి 1, సామర్లకోట 5, పిఠాపురం 24, గొల్లప్రోలు 14, యూ.కొత్తపల్లి 21, కిర్లంపూడి 21, జగ్గంపేట 18, రౌతులపూడి 14, తొండంగి 37, ఏలేశ్వరం 6, శంఖవరం 19, కోటనందూరు 16, పెద్దాపురంలో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.
News October 26, 2025
NGKL: రేపే మద్యం దుకాణాల కేటాయింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డీప్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టనున్నారు. మద్యం దుకాణాల కోసం జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వ్యాపారులలో టెన్షన్ మొదలైంది. జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు లక్కీ డీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.


