News March 14, 2025

నిర్మల్: PHOTO OF THE DAY

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.

Similar News

News March 26, 2026

ASF: ఇళ్లలో ఇంధనం నిల్వ చేయవద్దు.. ప్రమాదకరం!

image

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇంధన కొరత వదంతులతో ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. కొందరు ఏకంగా ఇళ్లలోనే పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసుకుంటుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా స్వల్ప వేడికి కూడా ఇంధనం నిప్పంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంధనానికి ఎలాంటి కొరత లేదని, ప్రాణాలను పణంగా పెట్టి నిల్వలు చేయవద్దని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.

News March 26, 2026

హార్ముజ్ భారత్‌కు తెరిచే ఉంటుంది: ఇరాన్ విదేశాంగ మంత్రి

image

హార్ముజ్ ఇండియాకు తెరిచే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్ సహా ఇరాన్ మిత్ర దేశాలైన చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్‌కు చెందిన నౌకలకు హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతించామని తెలిపింది. హార్ముజ్ వెంటనే ఓపెన్ చేయకపోతే తీవ్ర సంక్షోభం తప్పదని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.

News March 26, 2026

ఆముదాలవలస: నిండు గర్భిణీ ఆత్మహత్య.. బిడ్డను కాపాడిన వైద్యులు

image

ఆముదాలవలసలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన యండమూరి అపర్ణ (25) అనే నిండు గర్భిణి బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అపర్ణ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వెనువెంటనే కడుపులో ఉన్న బిడ్డను కాపాడారు. భర్తతో ఉన్న కలహాలే ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది. బిడ్డ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతుందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.