News April 9, 2025
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: సూర్యాపేట కలెక్టర్

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నిర్మిస్తున్న 650 పడకల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వైద్య అధికారులు, టీఎస్ ఎమ్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News April 18, 2025
తరచూ జలుబు వేధిస్తోందా?

సీజన్లతో సంబంధం లేకుండా కొందరిని తరచూ జలుబు వేధిస్తుంటుంది. దీనికి శరీరంలో అయోడిన్ లోపం కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో మాటిమాటికీ వచ్చే ఆవలింతలకు కారణం ఐరన్ లోపం అని అంటున్నారు. అలాగే, కాళ్లు, చేతుల కండరాల్లో రెగ్యులర్‌గా నొప్పులు వస్తుంటే శరీరంలో మెగ్నీషియం తక్కువైందని గుర్తించాలంటున్నారు. వెన్ను, కాళ్ల నొప్పులొస్తే విటమిన్-D టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News April 18, 2025
సూర్యాపేట: పొలం కోయిస్తుండగా కనిపించిన మృతదేహం

వరి పొలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపిన ఘటన మునగాలలో గురువారం చోటుచేసుకుంది. మునగాలకు చెందిన తూముల వీరస్వామి పొలంలో హార్వెస్టర్‌తో పొలం కోయిస్తుండగా మృతదేహం కనిపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే వీరస్వామి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
News April 18, 2025
? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటి?

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ క్వశ్చన్ చూశారు కదా! చిన్న లాజిక్ ఉపయోగిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ? ప్లేస్‌లో ఉండాల్సిన నంబర్ ఏంటో కనుగొంటే COMMENT చేయండి.