News April 22, 2025

నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.

Similar News

News April 21, 2025

చట్టపరంగా న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. బాధితుల అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

News April 21, 2025

వడ్డీతో సహా చెల్లిస్తాం: మేకపాటి

image

కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని వైసీపీ ఉదయగిరి ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

News April 21, 2025

1న నెల్లూరు జిల్లాకు సీఎం రాక

image

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన మే 1న ఆత్మకూరుకు రానున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం పక్కనే ఉన్న హెలిప్యాడ్‌ను ఆర్డీవో పావని, పోలీసులు పరిశీలించారు. సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

error: Content is protected !!