News April 22, 2025
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: SP

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ స్వీకరించి బాధితుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
Similar News
News April 22, 2025
నేడే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922 సెకండియర్‌లో 11,561 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఇంటర్మీడియట్ ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.- ALL THE BEST
News April 22, 2025
IPL: ‘టాప్’ లేపుతున్న గుజరాత్

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతోంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టేబుల్ టాపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు సైతం ఆ జట్టు వద్దే ఉన్నాయి. ఓపెనర్ సాయి సుదర్శన్ 417 రన్స్, బౌలర్ ప్రసిద్ధ్ 16 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్, గిల్, బట్లర్‌తో GT టాప్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది.
News April 22, 2025
866 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు

AP: ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీపై ఏపీపీఎస్సీ ఫోకస్ చేసింది. వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో రోస్టర్ పాయింట్ల ఖరారు తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు అగ్రికల్చర్, రవాణా, మున్సిపల్, జైళ్లు తదితర శాఖల్లో ఖాళీలున్నాయి.