News September 12, 2025
నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

కలెక్టర్ డా. జి. లక్ష్మీశా శుక్రవారం రాత్రి విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట, పరిసర ప్రాంతాల్లోని 11 వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజూ ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహణ, డయేరియా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం తదితరాలపై సూచనలు చేశారు. ప్రత్యేక కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News September 13, 2025
HNK: ఈనెల 14న ఎన్డీఏ & సీడీఎస్ పరీక్ష

ఈనెల 14న నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ సర్వీసెస్(సీడీఎస్) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాల్లో ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
News September 13, 2025
యాకుత్‌పురా ఘటనకు.. బాధ్యులపై హైడ్రా చర్యలు

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధవారం సిల్ట్‌ను తొలగించడానికి తెరచిన మ్యాన్ హోల్ మూయకపోవడంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డీఆర్ ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరికి డిమోషన్, ఇద్దరిని తొలగించాలని ఆదేశించింది.
News September 13, 2025
గోదావరిఖని: ప్రజా భవన్‌ను ముట్టడించిన కార్మిక సంఘాల జేఏసీ

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై జేఏసీ నాయకులు, కార్మికులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ను శుక్రవారం ముట్టడించారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నర్సయ్య నిలిచారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి సమస్యలపై విన్నవించారు. వేతనాలను పెంచాలని, లాభాల వాటా రూ.20 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.