News March 5, 2025
నిలువెల్లా రక్తం.. తల్లడిల్లిన తల్లి హృదయం..!

రోడ్డు ప్రమాదంలో ఆ తల్లికి తీవ్రగాయాలై నిలువెల్లా రక్తం కారుతోంది. అయినా సరే ఆ తల్లి హృదయం తన బిడ్డ కోసం తల్లడిల్లింది. తన బిడ్డకు ఏమైందోనని ఆమె పడిన ఆందోళన స్థానికులను కంటతడి పెట్టించింది. KMM జిల్లా <<15656275>>తనికెళ్ల వద్ద బస్సు బోల్తా<<>> పడిన ఘటనలో ఈ దృశ్యం కనిపించింది. బస్సులో ఉన్న తల్లాడ మండలం అన్నారుగూడెం వాసి బీరవెల్లి రాణికి రక్తం కారుతున్నా బిడ్డ కోసం వెతికింది. ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 6, 2025
దివ్యాంగుల కోసం హెల్ప్ డెస్క్: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో దివ్యాంగులకు హక్కులపై అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాల లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం తెలిపారు. యూ.డి.ఐ.డి కార్డు పొందే విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మండల కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
News March 5, 2025
ఖమ్మం: ఇంటర్ పరీక్షలు.. మొదటి రోజు 669 గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో మొదటిరోజు ఇంటర్ మొదటి సం.. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 16,317 మందికి గాను 15,845 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,384 మంది విద్యార్థులకు గాను 2,187 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 669 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News March 5, 2025
పైనంపల్లి గ్రామంలో ఒకేరోజు ముగ్గురు మృతి

ఒకేరోజు ముగ్గురు చనిపోయిన ఘటన నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పైనంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ డిఎస్పీ ఉసిరికాయల వెంకటాచలం గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు సత్యానందం, పోటు కృష్ణవేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకేరోజు ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.