News November 13, 2025

‘నిలోఫర్’ సమస్యలంటే సర్కారుకు చులకనే..!

image

నిలోఫర్ అస్పత్రి అంటే అదో ధైర్యం.. అక్కడ వైద్యానికి వెళ్తే పిల్లలకేం కాదనేది ఓ నమ్మకం. అయితే నిలోఫర్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మొరాయించే లిఫ్టులు పేషెంట్లకు నరకం చూపిస్తాయి. ఇక వెయిటింగ్ హాల్ ప్రారంభం కాక అలాగే ఉండిపోయింది. రోజూ 1,200 నుంచి 1,500 ఓపీ నమోదవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా ఇక్కడ బెడ్స్ సమస్య చిన్నారులను వేధిస్తోందని పేరెంట్స్ వాపోతున్నారు.

Similar News

News November 13, 2025

HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

image

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్‌లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్‌లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్‌లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News November 13, 2025

HYD: బిజీ లైఫ్ వల్ల బ్రెయిన్‌పై ఎఫెక్ట్!

image

HYDలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, నిద్రలేమి, పొగతాగడం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా మెదడుపై తీవ్రంగా ప్రభావం పడుతున్నట్లుగా సీనియర్ న్యూరో సర్జన్ వంశీకృష్ణ తెలిపారు. HYDలో NIMS ఆసుపత్రికి నెలకు 250 నుంచి 300 కేసులు వస్తున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత, యోగా, ధ్యానం, ప్రకృతితో గడపడం లాంటివి చేయాలని సూచించారు.
SHARE IT

News November 13, 2025

జూబ్లీబైపోల్: డివిజన్ల వారీగా ఓటింగ్ వివరాలు

image

1.షేక్‌పేట్ ఓటర్లు 71,062, పోలైన ఓట్లు 31,182(43.87%)
2.రహమత్‌నగర్ ఓటర్లు 74,387 పోలైన ఓట్లు 40,610(54.59%)
3.యూసుఫ్‌గూడ ఓటర్లు 55,705, పోలైన ఓట్లు 24219(43.47%)
4.ఎర్రగడ్డ ఓటర్లు 58,752, పోలైన ఓట్లు 29,112(49.55)
5.బోరబండ ఓటర్లు 53,211, పోలైనవి 29,760 (55.92%)
6.వెంగళ్‌రావునగర్ ఓటర్లు 53,595, పోలైన ఓట్లు 25,195(47.00%)
7.సోమాజిగూడ(PART) ఓటర్లు 34,653, పోలైన ఓట్లు14,553( 41.99%)