News March 24, 2024

నీటిని సంరక్షించే పనులను చేపట్టండి: రోనాల్డ్‌రోస్‌

image

నీటిని, సహజ వనరులను సంరక్షించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు పిలుపునిచ్చారు. వరల్డ్‌ వాటర్‌ డేను పురస్కరించుకొని శనివారం నీటి సంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రజా పనుల్లో కాంక్రీటు, టైల్స్‌ను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 19, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

image

నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జూబ్లీహిల్స్‌లోని ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. అభ్యర్థితో పాటు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసి విజయం సాధించడానికి చేయాల్సి కార్యచరణపై ఇవాళ చర్చించనున్నారు.

News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.  

News September 19, 2025

కోకా‌పేట్‌లో భర్తను చంపిన భార్య

image

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.