News December 18, 2025

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.

Similar News

News December 29, 2025

పుతిన్ ఇంటిపై దాడికి ఉక్రెయిన్ యత్నం: రష్యా

image

అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందని రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ‘91 లాంగ్ రేంజ్ డ్రోన్స్‌తో మా ప్రెసిడెంట్ ఇంటిపై ఉక్రెయిన్ నిన్న, ఇవాళ దాడికి ప్రయత్నించింది. వాటిని మా రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఇలాంటి చర్యలకు తప్పక సమాధానం చెప్పి తీరుతాం’ అని ఆయన హెచ్చరించారు. అయితే ఆ టైమ్‌లో పుతిన్ ఇంట్లో ఉన్నారా లేదా అనే దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

News December 29, 2025

మరోసారి ‘ఇండిగో’ విమానాల రద్దు

image

దేశవ్యాప్తంగా ఇవాళ 118 విమానాలను రద్దు చేసినట్లు ‘ఇండిగో’ తెలిపింది. ప్రతికూల వాతావరణం, ఇతర సమస్యలతో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. వీటిలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలున్నాయి. కాగా ఇటీవల ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డ విషయం తెలిసిందే.

News December 29, 2025

జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

image

TG: జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC మీటింగ్‌లో నిర్ణయించారు. 4న ఆదివారం సెలవు ఉండనుంది. దీంతో కొత్త సంవత్సరంలో 5 రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే, 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టేలా BRS, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని BJP రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. INC హామీలపై చర్చ జరగాలన్నారు.