News March 21, 2025

నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: మేయర్

image

నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఖిలావరంగల్ మండలంలోని ఉర్సు, కరీమాబాద్ వాటర్ ట్యాంకర్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నీటి సరఫరాలో జాప్యంగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చొరవ తీసుకోవాలని తెలిపారు. వాటర్ ట్యాంక్‌లో నీటి సరఫరా నిలిచిపోయిందని తన దృష్టికి రావడంతో ఇక్కడికి వచ్చానని అన్నారు.

Similar News

News March 1, 2026

ఖమేనీ కుటుంబంలో నలుగురు మృతి!

image

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబంలోని నలుగురు చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనవడు చనిపోయినట్లు పేర్కొంది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఖమేనీ ఇంటిపై 30 బాంబులు వదిలినట్లు తెలిపింది. ఇందుకోసం ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోందని, అగ్రనాయకులు అందరూ ఒకే దగ్గర ఉండగా అటాక్ చేసిందని వెల్లడించింది.

News March 1, 2026

యాదాద్రిలో నేటి నుంచి నిత్య ఆర్జిత సేవలు పునఃప్రారంభంలు

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో, నేటి నుంచి నిత్య ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. 11రోజుల వేడుకల అనంతరం నిత్య సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, జోడు సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఉత్సవాల కారణంగా నిలిపివేసిన ఈ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. బ్రహ్మోత్సవాల ముగింపుతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

News March 1, 2026

అన్నమయ్య: ప్రేమ పెళ్లి.. PSలో కౌన్సిలింగ్

image

అన్నమయ్య జిల్లా రామసముద్రం (M) దొడ్డిపల్లికి చెందిన సంతోశ్, భవాని అనే ప్రేమ జంట వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్దలు, గ్రామస్థుల సమక్షంలో చర్చించి వివాహం చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం జంటను అబ్బాయి తరఫు బంధువులకు అప్పగించారు.