News June 6, 2024

నీట్‌లో సత్తా చాటిన సిక్కోలు విద్యార్థి

image

గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆదర్శ కళాశాల, పాతపట్నంలో ఇంటర్ బైపీసీలో 953 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాలకే పేరు తెచ్చిన బండి గౌతమి 2024 నీట్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో 925వ ర్యాంకు, రీజనల్ స్థాయిలో 288వ ర్యాంకు సాధించింది. దీంతో ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని ప్రిన్సిపల్ రత్నకుమారి అన్నారు. గౌతమికి కళాశాల తరుపున అభినందనలు తెలిపారు.

Similar News

News February 14, 2026

సిక్కోలు ‘సిద్ధమైంది’

image

మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాకుళం జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని శ్రీముఖలింగం(ముఖలింగేశ్వర స్వామి), శ్రీకాకుళం(ఉమారుద్ర కోటేశ్వరస్వామి),రావివలస(ఎండల మల్లికార్జునస్వామి), పలాస(స్వయంభూ లింగేశ్వరస్వామి), పాతపట్నం(నీలకంటేశ్వర స్వామి) ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ ఏర్పడనుంది. దీంతో ఆయా ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News February 14, 2026

అందాల పోటీల్లో మెరిసిన శ్రీకాకుళం యువతి

image

హైదరాబాద్ వేదికగా ఐ‌ఎల్‌ఎ‌హెచ్‌ఇ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన మేఘన మెరిసింది. సెకండ్ రన్ రప్పుగా నిలిచి సత్తా చాటింది. మోడలింగ్‌పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చినట్లు ఆమె చెప్పారు. పలువురు ఈ యువతిని అభినందించారు.

News February 14, 2026

శ్రీముఖలింగేశ్వరుని ఉత్సావాల కార్యక్రమాలివే!

image

శ్రీముఖలింగం దేవాలయం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబు అయింది . ఈనెల15-18 వరకు వేడుకలు జరగనున్నట్లు దేవాదాయ శాఖాధికారులు చెప్పిన విషయం తెలిసిందే. ఆలయంలో 15న మహాశివరాత్రి జాగారం, 16న పడియా, 17న మహా పడియా, 18న వంశధార నదిలో శ్రీముకలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు జరగనున్నాయి. లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సావాలు విజయవంతమయ్యేలా ఏర్పాట్లను యంత్రాంగం చేపట్టింది.