News August 19, 2025

నీతి ఆయోగ్ రిపోర్ట్.. కడప జిల్లాకు లభించిన ర్యాంకులు.!

image

నీతి అయోగ్ రిపోర్టు ఆధారంగా కడప జిల్లాకు వచ్చిన ర్యాంకులను కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో
35వ ర్యాంక్, విద్యలో 100, వ్యవసాయంలో 24, ఆర్థికాభివృద్ధిలో 71, మౌలిక సదుపాయాల్లో 34వ ర్యాంక్ సాధించామని ఆయన పేర్కొన్నారు. వీటి ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ అధికారులు కలిసి సమష్ఠిగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ శ్రీధర్ సూచించారు.

Similar News

News August 19, 2025

ఆస్పిరేషనల్ ప్రోగ్రాంలో కడప జిల్లాకు మొదటి స్థానం

image

వెనుకబడిన కడప జిల్లాలను అభివృద్ధి చేయడం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశమని, ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఆస్పిరేషనల్ జిల్లాల్లోనే కడప జిల్లా 73.6 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. సోమవారం రాత్రి జిల్లా అధికారులతో ఆయన ఆస్పిరేషనల్ ప్రోగ్రాంపై సమీక్షించారు.

News August 19, 2025

కడప జిల్లాలో 27 బార్లకు నోటిఫికేషన్

image

కడప జిల్లాలో 27 బార్ల ఏర్పాటుకు జిల్లా P&E అధికారి రవికుమార్ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చారు. కడపలో 12, ప్రొద్దుటూరులో 7, బద్వేల్‌లో 2, పులివెందులలో 2, మైదుకూరులో 1, జమ్మలమడుగులో 1, ఎర్రగుంట్లలో 1, కమలాపురంలో ఒక బార్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. బార్ల లైసెన్స్‌ల కోసం అప్లికేషన్‌కు రూ.5 లక్షలు, లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు చిల్లించాలన్నారు. ఈనెల 18నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరణ, 28న లాటరీ తీస్తామన్నారు.

News August 19, 2025

కడప జిల్లాలో 27 బార్లకు నోటిఫికేషన్ విడుదల

image

కడప జిల్లాలో 27 బార్ల ఏర్పాటుకు జిల్లా P&E అధికారి రవికుమార్ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చారు. కడపలో 12, ప్రొద్దుటూరులో 7, బద్వేల్ 2, పులివెందుల 2, మైదుకూరు 1, జమ్మలమడుగు 1, ఎర్రగుంట్ల 1, కమలాపురంలో 1 బార్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. బార్ల లైసెన్స్‌ల కోసం అప్లికేషన్‌కు రూ.5 లక్షలు, లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు చిల్లించాలన్నారు. ఈ నెల 18 నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరణ, 28న లాటరీ తీస్తారని ఆయన తెలిపారు.