News March 1, 2025

నీరాకేఫ్ గీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగిస్తాం: మంత్రి పొన్నం

image

నిరాకేఫ్ను పూర్తిస్థాయిలో గీతా పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో గౌడ సంఘం నేతలు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణరావు గౌడ్ ఇతర నాయకులు మంత్రిని కలిసి పలు అంశాలను దృష్టికి తెచ్చారు. నీరాకేష్, పాపన్న గౌడ్ విగ్రహం, గౌడ సంఘం భవన నిర్మాణం అంశాలు CM దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు.

Similar News

News March 1, 2025

ప్రజల వద్దే రూ.6,471 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు

image

దేశంలోని ప్రజల నుంచి 98.18% ₹2,000 నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు RBI వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా 1.82%(₹6,471కోట్లు) నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023 మే 19న ₹3.56 లక్షల కోట్ల విలువైన ₹2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ నోట్లను RBI రీజినల్ కార్యాలయాల వద్ద ఎక్స్‌ఛేంజ్/డిపాజిట్ చేసుకోవచ్చు.

News March 1, 2025

ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ పరీక్షకు 958 మంది గైర్హాజ‌రు

image

శనివారం తొలిరోజు జరిగిన ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష ప్ర‌శాంతంగా జ‌రిగింది. తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ ప‌రీక్ష‌కు 40,695 మందికి గాను 39,737 మంది హాజ‌ర‌య్యారు. 958 మంది విద్యార్థులు గైర్హాజ‌ర‌య్యారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాల‌తో పాటు ప‌లు సిటింగ్ స్క్వాడ్ స్ విధుల్లో పాల్గొన్నాయి.

News March 1, 2025

ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలివే..

image

మార్చి నెలలో టాలీవుడ్‌లో బిగ్ హీరోల సినిమాల రిలీజ్ లేకపోయినా పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నెల 7న ఛావా(తెలుగు డబ్), 14న కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’, 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, 29న ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల కానున్నాయి. వీటితో పాటు అనువాద చిత్రాలు కింగ్ స్టన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, వీర ధీర శూరన్ 2(విక్రమ్), L2:ఎంపురాన్ ఇదే నెలలో రిలీజ్ కానున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

error: Content is protected !!