News January 31, 2025

నీల్వాయి: అడవి పందిని వేటాడిన ముగ్గురి అరెస్టు

image

నీల్వాయి రేంజ్ పరిధిలోని కొత్తగూడెం సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి అడవి పందిని చంపిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. నీల్వాయి గ్రామానికి చెందిన నర్వేల్లి మల్లయ్య, మంత్రి రాజన్న, గొర్లపల్లి గ్రామానికి చెందిన నికాడి నాగేష్ కొత్తగూడెం గ్రామానికి చెందిన నర్వెల్లి మల్లయ్య వరి పొలంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి అడవి పందిని చంపినట్టు గుర్తించామన్నారు.

Similar News

News September 16, 2025

నేడు సంగారెడ్డిలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్

image

సంగారెడ్డిలో నేడు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. జిల్లాలోని విద్యార్థులందరూ ఈ సెమినార్‌లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కి ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News September 16, 2025

VZM: ఉమ్మడి జిల్లాలో 578 పోస్టుల భర్తీ

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 578 పోస్టులు భర్తీ అయినట్లు ప్రభుత్వం తుది జాబితా విడుదల చేసింది. 583 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 4 ఉర్ధూ పోస్టులు, SA పీడీకి అభ్యర్థులు లేకపోవడంతో ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఈనెల 19న అమరావతిలో CM చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. 18న అమరావతి వెళ్లేందుకు మోపాడలోని శిక్షణ కేంద్రం నుంచి బస్సులు బయలుదేరనున్నాయని DEO మాణిక్యంనాయుడు తెలిపారు.

News September 16, 2025

KNR: KTR దావా.. MP సంజయ్ రియాక్షన్ ఇదే..!

image

MLA KTR వేసిన <<17724246>>పరువు నష్టం దావా<<>>పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందించారు. పిటిషన్‌ను న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటానన్నారు. ఇలాంటి చర్యలతో KTR బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘9 సార్లు జైలుకెళ్లొచ్చా, 100కు పైగా కేసులు ఫేస్ చేస్తున్న. KTRలా కేసులు వేయాలంటే ఇప్పటికే ఎన్నో కేసులు అయ్యేవి’ అన్నారు. తంబాకు తింటానని తనపై దుష్ప్రచారం చేశారని ఫైరయ్యారు. దీనిపై సవాల్ విసిరినా KTR స్వీకరించలేదన్నారు.